Gold Market : బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 93.92 పాయింట్లు తగ్గి 78,177.96 వద్ద, నిఫ్టీ 32.85 పాయింట్లు పడిపోయి 23,663 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతకుముందు ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 280 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నప్పటికీ ఆ జోరు ఎంతోసేపు నిలువలేదు. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బీపీసీఎల్ షేర్లు రాణిస్తుండగా శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com