BIHAR: బీజేపీ చలో అసెంబ్లీ.. పాట్నాలో హైటెన్షన్
బీహార్ రాజధాని పాట్నా రణరంగంగా మారింది. బీజేపీ చలో అసెంబ్లీ కార్యక్రమంలో హైటెన్షన్ నెలకొంది.దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలై బీజేపీ నేత విజయ్‌కుమార్ సింగ్ మృతి చెందారు.మరికొందరి తలలు పగిలాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ ఆరోపణలతో నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
నితీష్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతుంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో జూలై 3న సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సైతం చేర్చింది. దీంతో తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.
చలో అసెంబ్లీకి బీజేపీ నేతలు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.ఇటు పోలీసులు కూడా భారీగా రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వాటర్ కెనన్లు ప్రయోగించారు పోలీసులు.ఓ దశలో బిహార్ పోలీసులు బీజేపీ నేతలపై విరుచుకుపడిపోయారు. ఆందోలనకారులను నిలువరరించేందుకు దారుణగా ప్రవర్తించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. పోలీసుల దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తల తలలు పగిలాయి.అయినా వదలకుండా వెంట పడి మరీ చావగొట్టారు.పోలీసుల తీరుపై బీహార్ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.సీఎం నితీష్ కుమార్ పని తీరును తీవ్రంగా తప్పుపట్టారు.ఆందోళనలను అణచివేసే పద్ధతి ఇదేనా అంటూ నిప్పులు చెరిగారు.చేతిలో అధికారం ఉందని నితీష్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com