BJP : గర్భిణులకు రూ. 21 వేలు.. బీజేపీ కీలక ప్రకటన

బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కు బీజేపీ సంకల్ప్ పత్ (మ్యానిఫె స్ట్రో)ను విడుదల చేసింది. మహిళా సమృద్ధి యోజన పేరుతో మహి ళలకు ప్రతి నెల రూ.2,500 చొప్పున ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే ఆమోదం తెలుపుతామని పేర్కొ న్నారు. అలాగే పనేదల మహిళల కు గ్యాస్ సిలిండర్ పై రూ. 500 సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. గర్భిణులకు వైద్య ఖర్చుల కోసం రూ. 21,000 ఇవస్తామని తెలిపారు. బస్తీల్లో అటల్ క్యాంటీ న్లు ఏర్పాటు చేస్తామని, రూ.5కే భోజనం అందిస్తామని వివరిం చారు. దేశ రాజకీయాల్లోని నీతి, సంస్కృతిని ప్రధాని మోదీ మా ర్చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించేవని తర్వాత మర్చిపోయేవని, బీజేపీ చెప్పింది చేస్తుందని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అమల య్యే గ్యారెంటీ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో 500 హామిలిస్తే, 499 అమలు చేశామని పేర్కొన్నారు. 2019 ఎన్నికల టైంలో 235 హామీలిస్తే, 225 అమలు చేశామని, మిగతా హామీలు ప్రాసెస్ లో ఉన్నాయని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com