పార్టీ కార్యకర్తలు-పోలీసుల ఘర్షణలో బెంగాల్ బీజీపీ చీఫ్ కు గాయాలు

పార్టీ కార్యకర్తలు-పోలీసుల ఘర్షణలో  బెంగాల్ బీజీపీ చీఫ్ కు గాయాలు

తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు షాజహాన్ షేక్, అతని సహాయకులు తమపై చేసిన దౌర్జన్యాలపై మహిళలు ఆందోళన చేస్తున్న సందేశ్‌ఖాలీలోకి ప్రవేశించకుండా ఆపేశారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ పడడంతో పశ్చిమ బెంగాల్ బీజీపీ చీఫ్ సుకాంత మజుందార్ గాయపడ్డారు. అంతకుముందు రోజు, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని టాకీలోని గెస్ట్ హౌస్ నుండి సుకాంత మజుందార్‌ను బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ విధించిన సందేశ్‌ఖాలీ వైపు బీజేపీ నేతలు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు.

అయితే, బీజీపీ నాయకులు నిషేధాజ్ఞలను ధిక్కరించి సందేశ్‌ఖలీ వైపు తమ పాదయాత్రను కొనసాగించారు. ఇది పోలీసులతో గొడవకు దారితీసింది. నిషేధాజ్ఞలను ధిక్కరించడానికి ప్రయత్నించిన తర్వాత సందేశ్‌ఖాలీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసిర్‌హట్‌లో పోలీసు సిబ్బంది, బీజీపీ మద్దతుదారులు ఘర్షణ పడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. సందేశ్‌ఖాలీ బసిర్‌హత్ పోలీసు జిల్లా పరిధిలోకి వస్తుంది.

సందేశ్‌ఖాలీలో పరిస్థితిని నిరసిస్తూ బసిర్‌హట్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని ఘెరావ్ చేస్తామని బీజీపీ ప్రకటించడంతో ఘర్షణ జరిగింది. సుకాంత మజుందార్ నేతృత్వంలోని పార్టీ ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళుతుండగా పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

Tags

Next Story