Arvind Kejriwal : కేజ్రీవాల్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: బీజేపీ

Arvind Kejriwal : కేజ్రీవాల్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: బీజేపీ
X

కేజీవాల్ బెయిల్ పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన అరెస్టు చట్టబద్ధమైనదే అని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

కేజ్రీవాల్ షరతులతో బెయిల్ వచ్చారని.. ఆయనకు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా. ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయలేనప్పుడు ఇప్పుడు సీఎంగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు.

కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ వచ్చినప్పటికీ విచారణ కొనసాగుతుందని, త్వరలోనే ఆయనకు శిక్ష పడటం ఖాయమని ఆయన చెప్పారు. కేజీవాల్ గతంలో అరెస్ట్ అయిన సీఎంగా ఉండగా.. ఇప్పుడు బెయిల్ దొరికిన సీఎంగా మారారని చురకలంటించారు.

Tags

Next Story