దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీ హవా..

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జ్యోతిరాదిత్య సింథియా సింగిల్ హ్యాండ్‌తో ఎన్నికలను నడిపించారు. ఈ ఫలితాలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ సర్కారు సంపూర్ణ మెజారిటీ సాధించింది. సత్తా చాటుతామన్న కాంగ్రెస్.. మధ్యప్రదేశ్‌లో చతికిలపడింది. గుజరాత్‌లో 8 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 5 సీట్లలో, ఎస్పీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
ఇక కర్నాటకలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ బీజేపీనే గెలుపు దిశగా సాగుతోంది. జార్ఖండ్‌లో ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ బీజేపీనే ఆధిక్యంలో ఉంది. మణిపూర్‌లో ఒకే స్థానానికి ఎన్నిక జరగ్గా.. దాన్ని కూడా బీజేపీనే ఖాతాలో వేసుకుంది. చత్తీస్‌గఢ్, హర్యానాలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఒడిశాలో బిజూ జనతాదళ్ లీడ్‌లో కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com