Kangana : కంగనా వివాదంలో దానంపై కేసు పెట్టండి.. సీపీకి బీజేపీ మహిళా మోర్చా ఫిర్యాదు

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. మండి లోక్ సభ సభ్యురాలు కంగనా రనౌత్ పై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని సోమవారంఆమె మహిళా నేతలతో కలిసి సీపీకి వినతి పత్రాన్ని సమర్పించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే దానంపై చర్యలు తీసుకోవాలని శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. మహిళ అని కూడా కాకుండా, సభ్యసమాజం తలవంచుకునేలా, మహిళా శక్తిని అవమానపరుస్తూ కంగనాపై దానం దిగజారేలా మాట్లాడటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని ఆమె హెచ్చరించారు. అసభ్య పదజాలంతో సినీనటి, పార్లమెంట్ సభ్యురాలు కంగానా రనౌత్పై ఎమ్మెల్యే స్థాయిలో దానం నాగేందర్ చేసిన దూషణలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
దానంపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా నేతలతో కలిసి శిల్పారెడ్డి ఇటీవల రాష్ట్ర డీజీపీ, అదపు డీజీ మహేశ్ భగవత్ కు ఫిర్యాదులు చేశారు. ఇప్పటి వరకు అధికార పార్టీ, రేవంత్ ప్రభుత్వంతో సహా పోలీసులు దానంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com