Maharashtra: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్.. ఆ బోట్ వల్లే అనుమానాలు..

Maharashtra: మహారాష్ట్రలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర చేశారా..? రాయగఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌లో అనుమానాస్పద బోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోటులో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను గుర్తించారు.. మూడు ఏకే 47లు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు, మరికొన్ని తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇది ఉగ్రవాదుల కుట్రగా అనుమానిస్తున్నారు.. ఈ బోటు ఘటనతో రాయగఢ్ జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు.
ముందుగా కొంతమంది స్థానికులు హరిహరేశ్వర్ బీచ్ దగ్గర ఈ బోటును గుర్తించారు.. వెంటనే గజ ఈతగాళ్లు బోటు దగ్గరకు వెళ్లి పరిశీలించారు.. అందులో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్ని ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు..
దీనిని స్పీడ్ బోట్‌గా గుర్తించారు.. అటు ఈ ఘటనతో మహారాష్ట్ర ఏటీఎస్ అప్రమత్తమైంది.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోంది.. ఇది ఉగ్రవాదుల కుట్రే అయి ఉంటుందని అనుమానిస్తుండగా.. 26/11 తరహాలో దాడులకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.. ఈ అనుమానాస్పద బోటుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com