Boris Johnson: భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని.. ఇండియా-యూకే రోడ్ మ్యాప్‌పై చర్చ..

Boris Johnson (tv5news.in)
Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు రానున్నారు. ఈ నెల 21న ఆయన భారత పర్యటన ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేయడం, ఆ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలకు మద్దతునిస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.... ఈ కీలక సమయంలో భారత పర్యటనను ఎంపిక చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇండియా-యూకే రోడ్ మ్యాప్ 2030 అమలును ఇరుదేశాల ప్రధానులు ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెద్ద ఎత్తున బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యాలుగా ఇరుదేశాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2035 నాటికి 34 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నాయి.
బ్రెగ్జిట్ తర్వాత బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఇదే మొదటిసారి. భారత్ లో పెట్టుబడులపై జాన్సన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 21న అహ్మదాబాద్ లో జాన్సస్ పర్యటించనున్నారు. వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యంపై 22న భారత ప్రధాని మోదీతో జాన్సన్ చర్చించనున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com