BSNL : బీఎస్ఎన్ఎల్ అదిరపోయే ప్లాన్.. రూ.347 రీఛార్జ్‌తో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా.

BSNL : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం మరో బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా, బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.347లకే ఒక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 50 రోజుల వ్యాలిడిటీ పాటు, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS వంటి ప్రయోజనాలు లభిస్తాయి. తక్కువ ధరలో ఎక్కువ కాలం వాలిడిటీ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను రూపొందించారు.
బీఎస్ఎన్ఎల్ తన అధికారిక X ఖాతా ద్వారా ఈ రూ.347 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు నిరంతరాయమైన కమ్యూనికేషన్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని 50 రోజుల వ్యాలిడిటీ. ఈ 50 రోజులు వినియోగదారులకు ప్రతి రోజు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ 2GB డేటా కోటా పూర్తయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 80 kbpsకు తగ్గుతుంది. డేటాతో పాటు ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 SMS ప్రయోజనం కూడా లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ఈ రూ.347 ప్లాన్ మార్కెట్లో ఉన్న ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌ల కంటే చాలా చౌకగా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఎక్కువ డేటా వినియోగించే, కానీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కస్టమర్‌ల కోసం రూపొందించారు. కేవలం రూ.347 తో ఏకంగా ఒకటిన్నర నెల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా నిరంతర సేవలు పొందవచ్చు. ఇతర టెలికాం ఆపరేటర్లు ఇదే విధమైన వాలిడిటీ, డేటా సౌకర్యాల కోసం ఎక్కువ ధరలను వసూలు చేస్తున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్ అత్యంత సమర్థవంతంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం తమ యూజర్ బేస్‌ను పెంచడమే. గత కొంతకాలంగా బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదలలు చేసింది. అనేక నగరాల్లో 4G సేవలను ప్రారంభించింది. మెరుగైన కాల్ క్వాలిటీ, హై స్పీడ్ డేటా అందించడంపై దృష్టి సారించిన బీఎస్ఎన్ఎల్, రూ.347 ప్లాన్ ద్వారా కొత్త వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

