Budget Celebration : ఫిబ్రవరి 1న బడ్జెట్.. హల్వా వేడుకకు అంతా సిద్ధం.. విశేషాలు ఇవే

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరింది. మూడో సారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్కు శుక్రవా రం నాడు నార్త్ బ్లాక్లో తుదిమెరుగులు దిద్దారు. దీంతో బడ్జెట్ కసరత్తును పూర్తి చేసి హల్వా వేడులక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడ్జెట్ తయారీ లాక్ ఇన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ప్రతి సంవత్సరం సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకను నార్త్ బ్లాక్లో పెద్ద కడాయిలో తయారు చేస్తారు. తయారు చేసిన హల్వాను బడ్జెట్ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆర్ధిక మంత్రి స్వయంగా అందిస్తారు.
హల్వా వేడుక పార్లమెంట్లో సమర్పించడానికి బడ్జెట్ పత్రాలను ముద్రించే ప్రక్రియను కూడా సూచిస్తుంది. హల్వా వేడుక తరువాత లాక్ ఇన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. బడ్జెట్ తయారీ లో భాగస్వాములుగా ఉన్న అధికారులు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు ఆఫీస్ లోనే ఉండాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది లాక్ డౌన్ లాంటిది. ఎవరికీ బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. నార్త్ బ్లాక్ లోని బేస్మెంట్లోనే బడ్జెట్ పత్రాలను ముద్రిస్తారు. ఈ ప్రక్రియ 1980 నుంచి జరుగుతోం ది. బడ్జెట్ పత్రాలు లీక్ అవకుండా నిరోధించేందుకే అధికారులంతూ ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తరువాతే ఇక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. వీరి వద్ద ఫోన్లను కూడా అనుమతించరు. నిర్మలాసీతారామన్ వరుసగా 7వ సారి బడ్జెట్ ను ప్రవేపెట్టనున్నారు. ఇదో రికార్డు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com