భారీ వర్షాలు.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నవీ ముంబైలోని బేలాపూర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇద్దరు వ్యక్తులను రక్షించామని, శిథిలాల కింద చిక్కుకున్న మరొకరిని కనుగొనడానికి సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోందని NDRF అధికారి తెలిపారు.
షాబాజ్ గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. భవనం కుప్పకూలడంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది మరియు నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అగ్నిమాపక దళం ఇద్దరు వ్యక్తులను రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారి మీడియాకు నివేదించారు. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com