Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 23 మంది మృతి..

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 23 మంది మృతి..
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా డామ్టా ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా డామ్టా ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునోత్రి రోడ్డుపై 28 మంది టూరిస్టులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

యాత్రికులంతా మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాకు చెందినవారీగా గుర్తించారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 25 డెడ్‌బాడీలను వెలికితీశామన్నారు పోలీసులు. లోయలో పడిన తర్వాత బస్సు రెండు ముక్కలుగా విడిపోయినట్లు చెప్పారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్‌ ప్రభుత్వ హెల్త్ సెంటర్లకు తరలించారు. ఇక ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడూ మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు.

మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం డెహ్రాడూన్ బయల్దేరి వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర కాశీ బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒక్కొ కుటుంబానికి 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story