MADHYA PRADESH: బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రచార యుద్ధం..

MADHYA PRADESH: బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రచార యుద్ధం..
X
కాంగ్రెస్‌, కర్ణాటకలాగే సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఫొటోలు ఫోన్‌పే క్యూఆర్‌ కోడ్స్‌లో పోస్టర్లు వేసింది.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రచార యుద్ధం సాగుతోంది.కాంగ్రెస్‌, కర్ణాటకలాగే సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఫొటోలు ఫోన్‌పే క్యూఆర్‌ కోడ్స్‌లో పోస్టర్లు వేసింది. ఈ చిత్రాలను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.ఈ పోస్టర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఫోన్‌పే మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కు వార్నింగ్ ఇచ్చింది.దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

తమ బ్రాండ్‌ లోగో దుర్వినియోగ పరుస్తున్నారని,తమకు ఏ రాజకీయ పార్టీ లేక ప్రచారంతో గాని ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది.రిజిస్టర్ ట్రేడ్‌మార్క్‌ అయిన ఫోన్‌ ఫే లోగోను అనధికారిక వినియోగించడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ పోస్టర్లు, బ్యానర్లను తొలగించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ను ట్విట్టర్‌ వేదిగా కోరింది.గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బసవరాజ్‌ బొమ్మై సర్కారుపై కాంగ్రెస్ ఇలానే విమర్శలు చేసింది.40 పర్సెంట్ సర్కార్ అని, పేసీఎం అని పోస్టర్లు అంటించి, ప్రచారం చేసింది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ.

Tags

Next Story