Karnataka : కారు, ప్రైవేటు బస్సు ఢీ.. ఆరుగురు మృతి

Karnataka : కారు, ప్రైవేటు బస్సు ఢీ.. ఆరుగురు మృతి
X

కర్ణాటకలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో జోగులాంబ గద్వాలకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. విజయపుర జిల్లా మనుగులి సమీపంలో తెల్లవారు జామున 5 గంటల సమయంలో కారును ప్రైవేటు ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టి. భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్నతో పాటు కారు డ్రైవర్ శివప్పతో పాటు బస్ డ్రైవర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ పట్టణంలోని కెనరా బ్యాంకులో పని చేస్తున్నారు. కుటుంబంతో కలిసి గద్వాలలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

విజయ్ పుర పోలీసుల కథనం ప్రకారం షోలాపూర్ వైపు వెళుతున్న ప్రయివేటు వాహనాన్ని ముంబయి నుంచి బళ్లారికి వస్తున్న ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు, బస్సులోని ఒకరు స్పాట్లోనే మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని తెలిసింది.

Tags

Next Story