Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్‌పై కేసు

Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్‌పై కేసు
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారని ఆరోపిస్తూ జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ అయ్యర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట మంత్రిపై ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దీంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం.. కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర పోలీసులను శుక్రవారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 10కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిలక్‌నగర పోలీసులు తాజాగా కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారు. నిర్మలా సీతారామన్‌తోపాటు మరికొందరిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు.

Tags

Next Story