CBSE Board Exams : సీబీఎస్ఈలో ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్

విద్యార్ధులకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త అప్ డేట్ ఇచ్చింది. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్నీ కుదిరితే 2026 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటుచేయగా వచ్చే సోమవారం నుంచి దీనిపై ప్రజాభి ప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమలులోకి వస్తే విద్యార్థులకు పరీక్షల వత్తిడి తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు విద్యార్థులు వారి మార్కులను (స్కోర్) మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ కరిక్యులమ్ కూడా అందుబాటు లోకి తీసుకురావలని సీబీఎస్సీ బోర్డు యోచిస్తున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com