Mpox : ఎయిర్​పోర్టులకు కేంద్రం అలర్ట్.. మంకీపాక్స్​పై అప్రమత్తంగా ఉండాలని సూచన

Mpox : ఎయిర్​పోర్టులకు కేంద్రం అలర్ట్.. మంకీపాక్స్​పై అప్రమత్తంగా ఉండాలని సూచన
X

మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, ల్యాండ్‌ పోర్టుల్లోని అధికారులు.. మంకీపాక్స్‌ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రి, సఫ్దార్‌జంగ్‌తోపాటు లేడీ హార్డింగ్‌ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్ చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో నోడల్‌ సెంటర్లను గుర్తించి వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

Tags

Next Story