PM Modi : నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త పథకం.. రేపు ప్రారంభించనున్న మోడీ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో ఈ నూతన పథకాన్ని ప్రధాని మోడీ ఆగస్టు 1న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న కార్మికులకే కాదు, వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది.
నూతన ఎంప్లాయిస్‌కు అలాగే ఎంప్లాయర్స్‌కు లబ్ధి కలిగేలా పథకాన్ని రూపకల్పన చేశారు. నెలకు 1 లక్షలోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఈ పథకానికి అర్హులు. ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి వికసిత్ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. దీనికోసం రూ.99, 446 కోట్ల బడ్జెట్‌తో రెండేళ్లలో మూడున్నర కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో దాదాపు రెండు కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ కొత్త స్కీం ఆగస్టు 1 2025 నుండి జూలై 31 2027 మధ్య ఎంపికయ్యే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈపీఎఫ్‌లో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రూ.15,000 కేంద్రం జమ చేస్తుంది. రెండు విడుతలుగా ఈ డబ్బును అర్హుల అకౌంట్లో జమ చేయనుంది. ఆగస్ట్ నుండి అమలులోకి రానున్న ఈ పథకం దేశంలో నూతన ఉపాధి అవకాశాలను ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పాత్ర పోషించనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com