Central : జీరో బిల్ లక్ష్యంగా కేంద్రం సూర్యఘర్ స్కీం.. రెండేళ్లలో కోటి కుటుంబాలు టార్గెట్

Central : జీరో బిల్ లక్ష్యంగా కేంద్రం సూర్యఘర్ స్కీం.. రెండేళ్లలో కోటి కుటుంబాలు టార్గెట్
X

దేశంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన స్కీమ్ విజయవంతంగా అమలు అవుతోందని కేంద్రం తెలిపింది. విద్యుత్ కోసం సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న వారికి జీరో విద్యుత్ బిల్లులు వస్తాయని కేంద్రం చెబుతోంది. ఇందుకోసం తీసుకు వచ్చిన స్కీమ్ ఇప్పటి వరకు 8 లక్షల 64 వేల కుటుంబాలు ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 5 లక్షల 54వేల గృహ వినియోగదారులకు సూర్యఘర్ పథకం కింద 4,308 కోట్ల నిధులను కేంద్ర సాయం కింద విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ రాజ్యసభలో తెలిపారు. 2027 మార్చి నాటికి కోటి కుటుంబాలకు సౌర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్రం సూర్య ఘర్ స్కీమ్ ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రూప్ టాప్ సోలార్ స్కీమ్. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి సగటున 77,800 రూపాయలను కేంద్రం సాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఈ స్కీమ్ అమలుతో 45 శాతం కుటుంబాలకు సున్నా విద్యుత్ బిల్లులు వచ్చాయని మంత్రి వివరించారు.

Tags

Next Story