కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేత

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే ఈ చివరి పార్లమెంటరీ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తుంది. కానీ గత సెషన్ లో 146 మంది ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ 146 మంది విపక్ష ఎంపీలపై (MPs) విధించిన సస్పెన్షన్ (Suspension) ఎత్తివేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) వెల్లడించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా దుండగుల దాడితో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్‌లో భద్రత కరువైనదని కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా, సభ చర్చలకు అంతరాయం కలిగించినందుకు లోక్‌సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలను రాష్ట్రపతి ఓం బిర్లా బహిష్కరించారు. అదే సమయంలో, రాజ్యసభలో ఇలాంటి సంఘటనల కారణంగా కొంతమంది సభ్యులను రాజ్యసభ ఛైర్మన్ కూడా సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ ఎత్తివేస్తారు..
ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ సమావేశం కావడంతో ఎంపీలంతా హాజరు కావాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్లన్నీ ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. విపక్ష ఎంపీల సస్పెన్షన్లను ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్‌కు ప్రభుత్వం తరఫున వినతి పత్రం అందించారు. దీన్ని వారు కూడా అంగీకరించారు.
కాగా, 135 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిసింది. కానీ బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com