PM Kisan : ఈనెల 24న రైతులకు కేంద్రం నిధులు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను ఈ నెల 24న విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2025, చివరి వారంలోనే 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీన బిహార్‌లో పర్యటిస్తారు. వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేయనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ మ్మాన్ నిధి స్కీమ్ బెనిఫిట్స్ అందాలంటే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటి వరకు 18 విడతల్లో కేంద్రం సాయం అందించింది. 18వ విడత నిధులు అక్టోబర్ 15, 2024న ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. మూడు విడతల్లో 2 వేల చొప్పున డబ్బులు జమ చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com