156 ఔషధాలపై కేంద్రం బ్యాన్!

రోగులకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందనే అనుమానాలున్న 156 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. జ్వరాలు, నొప్పులు, అలర్జీలకు రెండు మూడు ఔషధాలను కలిపి వాడే మందుల్ని కాంబినేషన్ డ్రగ్స్ అంటారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ కాంబినేషన్‌లో ఉండే మెడిసిన్స్ పై నిషేధం పడింది. ఇప్పుడు ఈ మందులు మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉండవని సమాచారం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com