PF Withdrawal : ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఎప్పటినుంచంటే?

PF Withdrawal : ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఎప్పటినుంచంటే?
X

పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని మే నెలాఖరు లేదా జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. అయితే విత్‌డ్రా లిమిట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న అనారోగ్య నిబంధనలతో పాటు గృహ నిర్మాణం, విద్య, వివాహం కోసం కూడా నిధులను విత్‌‌డ్రా చేసుకోవచ్చని వివరించారు. "ఈపీఎఫ్ఓ తన ప్రాసెస్ లన్నింటిని డిజిటలైజ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. విత్‌‌డ్రా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్‌‌లను ఏకీకృతం చేసింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం 3 రోజులకు తగ్గించింది.

Tags

Next Story