Internship : కోటి మంది యువతకు నెలకు రూ.5వేలు.. కేంద్రం ఇంటర్న్‌షిప్ సాయం

బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రానున్న ఐదు సంవత్సరాల్లో కోటి మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు. టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్ మూలంగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాల మెరుగుపడతాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఐదు సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు స్కిల్స్ తో పాటు, ఉద్యోగాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కేంద్రం 2 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది.
ఇంటర్న్‌షిప్ చేసే వారు 12 నెలల పాటు పరిశ్రమల్లో పని చేయడం వల్ల వారికి రియల్ లైఫ్ బిజినెస్ వాతావరణంలో నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇంటర్న్ కు నెలకు 5 వేల రూపాయల అలవెన్స్ ఇస్తారు. దీంతో పాటు ఒకసారి ప్రోత్సాహంగా 6 వేల రూపాయలు ఇస్తారు. కంపెనీలు శిక్షణా ఖర్చును, ఇంటర్న్‌షిప్ వ్యయంలో 10 శాతం వారి సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి భరిస్తారు. ఇలాంటి పథకం కోసం తాము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నామని ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కేపీఎంజీ ఇండియా ప్రతినిధి నారాయణన్ రామస్వామి అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com