Rahul Gandhi : రాహుల్కు కొత్త బంగ్లా -కేటాయించిన కేంద్రం

Rahul Gandhi : రాహుల్కు కొత్త బంగ్లా -కేటాయించిన కేంద్రం
X

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం కొత్త బంగ్లాను కేటాయించింది. సనేహ్రి బాగ్ రోడ్డులోని 5వ నెంబర్‌ బంగ్లాను ఆయనకు ఆఫర్ చేసింది. ఈ నివాసాన్ని ప్రియాంక గాంధీ పరిశీలించినట్లు తెలుస్తోంది. రాహుల్ ఓకే అంటే అదే తన అధికారిక నివాసంగా మారనుంది. రాహుల్ ప్రస్తుతం 10 జన్‌పథ్‌లో సోనియా గాంధీతో కలిసి ఉంటున్నారు. పరువు నష్టం కేసులో ఆయన దోషీగా తేలడంతో ఏడాది క్రితం ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. దాంతో రాహుల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అది కేబినెట్ ర్యాంక్ కలిగిన హోదా కావడంతో ఆయనకు టైప్ 8 బంగ్లాను కేటాయించారు. టైప్ 8 బంగ్లాను క్యాబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్రంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.

Tags

Next Story