Jamili Election : జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

Jamili Election : జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
X

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే. జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో అన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. లోక్‌సభ కాలవ్యవధికి, రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధికి సంబంధం లేదన్నారు.

Tags

Next Story