Chandigarh Youth : దేశం కోసం ప్రాణాలిస్తం.. చండీగఢ్ యువత

Chandigarh Youth : దేశం కోసం ప్రాణాలిస్తం.. చండీగఢ్ యువత
X

దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు మేం సి ద్ధమంటోంది చండీగఢ్ లోని యువత. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా పనిచేసేందుకు రావాలని ఆర్మీ పిలుపు నిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో యువతీ యువకులు తరలివచ్చా రు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇది ప్రజల భా వోద్వేగాలు, జాతీయ అవసరాలకు యువత సిద్ధంగా నిలవడం దేశ ఐక్యతకు చిహ్నంగా పలువురు అభివర్ణిస్తున్నారు. చండీగఢ్ స్థాని కుడైన ముస్కాన్ మాట్లాడుతూ.. సైన్యానికి మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు మన కోసం చాలా చేస్తున్నారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాం' అన్నారు. కరన్ చోప్రా అనే యువకుడు మా ట్టాడుతూ.. "నేను భారతదేశం కోసం నా ప్రా ణాలను ఇవ్వడానికి సిద్దం. ఫాం పూర్తి చేసి ఇచ్చి వస్తున్నానని చెప్పారు. మా నుంచి ఏం ఆశించినా చేస్తం అని చెప్పారు. సైన్యం ప్రక టన జారీ చేసిన తర్వాత చండీగఢ్ నగరంలో భారీగా క్యూలు కనిపించాయి. పౌర సహాయా నికి వాలంటీర్లు గా నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచ్చారు. చండీగఢ్ కు చెందిన పరంబీర్ సింగ్ మాట్లాడుతూ, "మా దేశానికి మా సేవలను అందించడానికి మేం ఇక్కడ ఉన్నాము. మేము ఫారమ్ను (స్వచ్ఛంద సేవ కోసం) ఇచ్చాం" అని చెప్పారు. మరో స్థానికు రాలు సంజన అరోరా మాట్లాడుతూ భారత సైన్యానికి సహాయం చేయాలని వచ్చానని అన్నారు. "పరిపాలన యంత్రాంగం మమ్మ ల్ని ఇక్కడికి పిలిచింది, ఇంత పెద్ద సంఖ్యలో యువకులు హాజరు కావడం నమ్మశక్యం కావడం లేదు' అన్నారు. సాధారణంగా ఉద యాన్నే మేల్కొనని వారు కూడా భారీ సంఖ్యలో వచ్చారు' అని ఆమె తెలిపారు.

Tags

Next Story