Chandrababu: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు.. చాలాకాలం తర్వాత..

Chandrababu: ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు.. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు.. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్‌లో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.. సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదిక మీద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కనిపించడం విశేషం..
కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు.. ఇక మోదీపాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులతో ఆయన ముచ్చటించారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు.. దాదాపు అరగంటపాటు ఆమెతో పలు అంశాలపై చర్చలు జరిపారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతిచ్చింది.. ఈ నేపథ్యంలో ముర్ము రాష్ట్రపతి అయ్యాక చంద్రబాబు తొలిసారి ఆమెతో భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com