Chandrayaan-3 : చంద్రయాన్-3కి మరో అరుదైన గుర్తింపు

Chandrayaan-3 : చంద్రయాన్-3కి మరో అరుదైన గుర్తింపు
X

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని ఆ సమాఖ్య కొనియాడింది.

2024 అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును బహూకరించనున్నారు. ఇస్రో చంద్రయాన్ -3 ల్యాడర్ 2023 ఆగస్టు 23న చంద్రుడిపై విజయ వంతంగా దిగి రోదసీ చరిత్రలోనే అరుదైన ఘనత నమోదుచేసింది. ఈ విజయంతో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరిందని అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ సమాఖ్య తెలిపింది.

ఇస్రో మిషన్ చంద్రయాన్ శాస్త్రీయ ప్రయోగం తక్కువ ఖర్చుతో కూడిన ఇంజినీరింగ్ కు ప్రత్యేక ఉదాహరణ అని, ఇది అంతరిక్ష పరిశోధనలో భారత్ కు ఉన్న భారీ సామర్థ్యానికి చిహ్నమని సంస్థ తెలిపింది. చంద్రుడి నిర్మాణం, భూగర్భ శాస్త్రంలో కనిపించని అంశాలను చంద్రయాన్ -3 వెలుగులోకి తెచ్చిందని వివరించింది.

Tags

Next Story