Tax Slabs : వేతన జీవులకు శ్లాబుల్లో జరిగిన మార్పులు ఇవే!

గతంలోనూ, ప్రస్తుతం కూడా 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. గతంలో 3-6 లక్షల శ్లాబులో 5 శాతం పన్ను ఉండేది, ఈ పరిమితిని ప్రస్తుతం 7 లక్షలకు పెంచారు. ఈ మేర శ్లాబులో మార్పు చేశారు. గతంలో 6-9 లక్షల శ్లాబుకు 10 శాతం పన్ను ఉండేది. దాన్ని ప్రస్తుతం 7-10 లక్షలకు మార్చారు. ఈ ఊరట పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి ఉండదు.
పాత పన్ను విధానంలో 2.5 లక్షల వరకు ఎలాటి పన్ను ఉండదు. 2.5-5 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది. 5-10 లక్షల వరకు 20 శాతం, 10 లక్షల పైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెన్షనర్లకు ఇదే తరహా ఊరట కల్పించారు.
పెన్షనర్లకు రూ.15 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని 25 వేల రూపాయలకు పెంచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. 8.61 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలిపారు. పాత పన్ను విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తారా అన్న ప్రశ్నకు ఆర్ధిక మంత్రి చర్చించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com