Chennai : నీట మునిగిన చెన్నై నగరం

Chennai : నీట మునిగిన చెన్నై నగరం
X

తమిళనాడు రాజధాని చెన్నై నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో మహా నగరం జలమయం అయింది. జన జీవనం అస్తవ్యస్థమైంది. చెన్నై వ్యాప్తంగా పలుచోట్ల 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. 300 ప్రాంతాలు నీటి మునిగాయి. పలు సబ్వేలలో మూడు అడుగుల మేర నీరు నిలిచింది. చెన్నైతో పాటు సమీప తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి.

చెన్నపట్నానికి ఐఎండీ మొదట ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు పడుతుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఇవాళ కూడా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరదలు ముంచెత్తడంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వరదల్లో తమ కార్లు కొట్టుకుపోతాయని కొందరు సమీపంలోని ఫ్లైఓవర్లలో కార్లను పార్కు చేశారు.

Tags

Next Story