Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం : చిదంబరం

Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం : చిదంబరం
X

ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్డీయే పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు.

జమిలి నిర్వహణకు కనీసంగా ఐదు రాజ్యాంగ సవరణలైనా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సవరణల్ని ఉభయ సభల్లో ఆమోదించేందుకు ఎన్డీయేకి తగిన సంఖ్యాబలం లేదని, ఇండియా కూటమి ఏకకాల ఎన్నికల్ని వ్యతిరేకిస్తుందని చిదంబరం చెప్పారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నది కాంగ్రెస్సేననీ.. వాటిని ఎందుకు రద్దు చేయమంటామని అన్నారు. సీలింగ్ ఎత్తేయాలన్న డిమాండ్ నే తాము వినిపిస్తున్నామన్నారు.

Tags

Next Story