TVK Chief Vijay : చిన్నపిల్లల కొట్లాట.. హిందీ వివాదంపై , టీవీకే చీఫ్ విజయ్

వచ్చే ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ అన్నారు. కొంతకాలంగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే.. కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ భాష విషయంలో కొనసాగుతోన్న వివాదం చిన్న పిల్లల కొట్లాటలా ఉందంటూ సెటైర్ వేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. పెత్తందార్లు, భూస్వాము లు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్అయ్యారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు. 'నూతన విద్యావిధానం, త్రిభాష సూత్రం అమలుపై ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డీఎంకే, బీజేపీ రెండూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి' అని మండిపడ్డారు. ప్రత్యేక సలహాదారుడిగా పీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటున్నాయి. విజయ్ పార్టీ కార్యక్రమానికి తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. ఆయనతో కలిసి విజయ్ వేదికను పంచుకొని.. ప్రజలకు అభివాదం చేశారు. దీంతో పీకే టీవీకే ప్రత్యేక సలహాదారుడిగా ఉండడం ఖాయమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com