LPG eKYC : వంటగ్యాస్ ఈకేవైసీపై.. కేంద్రం క్లారిటీ

వంటగ్యాస్ ఈకేవైసీపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వంటగ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్రం కానీ చమరు సంస్థలు కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ పక్రియను చేపడుతున్నాయి. గత 8 నెలలుగా ఇది కొనసాగుతోందని తెలిపారు.
ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్స్ వివరాలను వెరిఫై చేస్తారు. వారి మొబైల్ ఫోన్లలోని యాప్‌తో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. లేదా కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు దగ్గర్లోని డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి కూడా దీన్ని పూర్తి చేయొచ్చు.
దీంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకొని సొంతంగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని హర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com