దేశ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా జతకడుతాం: సీఎం కేసీఆర్

X
By - Subba Reddy |16 Jun 2023 2:30 PM IST
జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో తమది ఫ్రంట్ కాదని తేల్చి చెప్పారు గులాబీ బాస్ కేసీఆర్
జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో తమది ఫ్రంట్ కాదని తేల్చి చెప్పారు గులాబీ బాస్ కేసీఆర్.కేంద్రంలో ఏర్పడేదికాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వమేనని గతంలో పదే పదే చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం తన స్ట్రాటజీ మార్చుకుంటున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్సపర్ట్స్. దేశ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా జతకడుతామంటున్నారు గులాబీ దళపతి. ఉద్యమ కాలంలో కూడా ఇదే పంధా అవలంబించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతానని అన్నారు. ఇదే స్లోగన్‌తో ప్రత్యేక రాష్ట్రం సాధనలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడుజాతీయ రాజకీయాలలో కింగ్‌మేకర్ గా మారేందుకు పధకాలు రచిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత ఆ దిశగా మహారాష్ట్ర టూర్‌లో చేసిన ప్రసంగాల్లో కేసీఅర్ క్లారిటీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com