CM Revanth Reddy : రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth Reddy : రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ..
X

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై వివరించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించేలా చూడాలని వారిని సీఎం కోరారు. రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. మరోవైపు దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే పారదర్శకంగా, పకడ్బందీగా కులగణన చేశామని చెబతూ..ఇవాళ ఎంపీలకు రేవంత్‌రెడ్డి ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యమనే అంశాన్ని పార్టీ హైలెట్ చేయనుంది.

Tags

Next Story