Karnataka : పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా.. సీఎం సిద్ధరామయ్య సవాల్

Karnataka : పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా.. సీఎం సిద్ధరామయ్య సవాల్
X

కర్ణాటక ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను నిరూపిం చాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. నిరూపించలే కపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పు కోవాలని సవాల్ చేశారు. కాగా రెండు రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలా సభలో మోదీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ శాఖ భారీ కుంభకోణం జరిగిందని, ఆ సొమ్మును మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్ని కల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటోందని అన్నారు. అలాగే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తుందో.. ఆ రాష్ట్రం కాంగ్రెస్ కు ఏటీఎంలా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్రంలో ఎలాంటి నిధుల దుర్వి నియోగం జరగలేదన్నారు.

Tags

Next Story