Karnataka CM : ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు మళ్లీ చిక్కులు

కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన ముడా కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మళ్లీ చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ కేసులో లోకాయుక్త క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సవాస్ చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన చేసింది. కుంభకోణంలో సీఎం హస్తం ఉందనేందుకు ఆధారాలు న్నాయని చెప్పింది. సిద్ధరామయ్యను నిర్దోషిగా పే ర్కొంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నివేదికను ఈడీ సవాల్ చేసింది. లోకాయుక్త నివేదికను కొట్టివేయాలంటూ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసింది. ముడా కేసులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందనడానికి తమవద్ద తగిన ఆధారాలున్నాయని, సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులకు ముడా స్కాంలో ప్రమేయం ఉందని రుజువుచేసే ఆధారాలను ఇస్తామని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com