రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ.5లక్షలు ఇవ్వండి.. సీఎంకు మొర

రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ.5లక్షలు ఇవ్వండి.. సీఎంకు మొర

ఇది ఇండియాలో కామన్ గా వినిపిస్తున్న సమస్యే. డెస్క్ టాప్ జాబ్స్ పెరిగిపోయిన ఈ సమయంలో.. ఇలాంటి కామెంట్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకున్నందుకు తమకు పిల్లను ఇచ్చేందుకు, పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదని పలువురు కన్నడ యువ రైతులు వాపోతున్నారు. దీంతో తమకు 45 యేళ్ళు వచ్చినా అవివాహితులుగానే మిగిలిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు.

రైతు పని చేసే యువకుడిని పెళ్లి చేసుకునే అమాయికి రూ.5 లక్షలు నగదు ప్రాత్సాహక బహుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘాలతో జరిగిన భేటీలో సీఎం సిద్ధరామయ్యకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు.

కన్నడ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు, వివిధ పథకాల అమలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో సేద్యాన్ని నమ్మకుని, ఏటా లక్షలు అర్జిస్తున్నా కూడా యువ రైతులకు పెళ్లి కావడం లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులను పెళ్ళి చేసుకునే అమ్మాయికి ప్రభుత్వం తరపున నగదు ప్రోత్సాహం ప్రకటించాలని కోరారు. ఈ అభ్యర్థన జనంలో చర్చనీయాంశమైంది.

Tags

Next Story