Colder Winter: పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు, మరో 4-5 రోజుల్లో ఎముకలు కొరికేంత చలి!

ఈ సంవత్సరం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చలి ఎక్కువుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలలో ఎముకలు కొరికేంత చలి ఉండనుంది. ఇందుకు కారణం ‘లా నినా’. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. లా నినా కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చలి ఎక్కువుగా కొనసాగే అవకాశం ఉంది. లా నినా పరిస్థితులు ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాబోయే కొన్ని నెలల్లో లా నినా పరిస్థితులు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర చెప్పారు.
భూమధ్య రేఖ వెంబడి తూర్పు పసిఫిక్ ఉపరితల జలాలు చల్లబడినప్పుడు లా నినా సంభవిస్తాయి. గాలి, పీడనం మరియు వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తుంది. ఎల్ నినా (సముద్రాలు వేడెక్కడం) ఉష్ణమండల ప్రాంతాలలో వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్-డిసెంబర్‌లో లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గత వారం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 54 శాతం ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం డిసెంబర్‌లో బలహీనమైన లా నినా ఉద్భవించింది కానీ.. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. తూర్పు-మధ్య మరియు మధ్య పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో లా నినా ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వచ్చే శీతాకాలంలో సాధారణం కంటే వాతావరణం మరీ చల్లగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ చెప్పారు. ఇటీవలి ఏళ్లలో లా నినా ప్రభావం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సగటు 2-3 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుతం,వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా అక్టోబర్ 4 వరకు కొనసాగవచ్చు. అక్టోబర్ 4 నుంచి హిమాలయ ప్రాంతాలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వలన ముందస్తు వర్షం, చలి వస్తుంది. లా నినా 2025-26 శీతాకాలం ఈ దశాబ్దంలోనే అత్యంత చల్లగా ఉండనుంది. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండనుంది. ఈ చలి వ్యవసాయంపై కూడా ప్రభావం చూపుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com