Yuvraj Father : రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు అని అవమానించిన కాంగ్రెస్ నేత షమా మహ్మద్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. అభిమానులు, బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను మధ్యలోకి లాగారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా హిట్‌మ్యాన్ ట్వీట్ చేశారు. దానికి ‘దోబీ కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా’ అంటూ విమర్శించిన కంగన రిప్లైను ఆమె పోస్టు చేశారు.
అయితే ఆమె కామెంట్లను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్‌పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్‌పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.
షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com