మేం అధికారంలోకి వస్తే ఎంఎస్‌పీపై చట్టం తెస్తాం

మేం అధికారంలోకి వస్తే ఎంఎస్‌పీపై చట్టం తెస్తాం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే, వివిధ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఉండేలా ఇండియా కూటమి చట్టాన్ని తీసుకువస్తుందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ కూడా ఇదే కావడం గమనార్హం.

వివిధ వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరని కాపాడే చట్టాన్ని అమలు చేస్తామన్న హామీ కాంగ్రెస్ నాయకత్వం నుండి వెలువడిన కీలక ఈ వాగ్దానం హాట్ టాపిక్ గా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వారు పోషించే ముఖ్యమైన పాత్రను ఎత్తిచూపుతూ రైతుల ఆందోళనలు, సంక్షేమాన్ని పరిష్కరించడానికి పార్టీ నిబద్ధతను ఖర్గే నొక్కిచెప్పారు.

రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..

‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ.. ఈరోజు రైతు సోదరులకు చారిత్రాత్మక దినం అని అన్నారు. స్వామినాథన్ కమీషన్ ప్రకారం పంటలపై ప్రతి రైతుకు చట్టపరమైన హామీని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ చర్య 15 కోట్ల మంది రైతు కుటుంబాలను వారి శ్రేయస్సుకు భరోసా ఇవ్వడం ద్వారా వారి జీవితాలను మారుస్తుంది" అని ఆయన పోస్ట్ చేశారు. ''న్యాయ్ (న్యాయం) మార్గంలో వెళుతోన్న కాంగ్రెస్ కు ఇది మొదటి హామీ అని పోస్ట్ లో జోడించారు.

Tags

Read MoreRead Less
Next Story