Sudhanshu Trivedi : కాంగ్రెస్ ఎన్నడూ మన్మోహన్ సింగ్‌ను గౌరవించలేదు: సుధాంశు త్రివేది

మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. బతికున్నప్పుడు వాళ్లెప్పుడూ ఆయన్ను గౌరవించలేదని విమర్శించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు. మోదీ ప్రభుత్వం ప్రణబ్, మాలవీయ, పీవీని భారతరత్నతో గౌరవించింది. కాంగ్రెస్‌లో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు కాకుండా పదేళ్లు ప్రధానిగా చేసింది మన్మోహన్ ఒక్కరే. పటేల్, శాస్త్రి, పీవీని వాళ్లు అవమానించారు’ అని వివరించారు.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com