Congress Demand: ఆపరేషన్ సిందూర్ నష్టం బయటపెట్టాలి.. కాంగ్రెస్ సంచలన డిమాండ్

ఆపరేషన్ సిందూర్, మోదీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కామెంట్స్ పాకిస్తాన్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. మొన్న దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఆపరేషన్ సింధూర్‌లో ఎన్ని విమానాలను కోల్పోయామో తెలపాలని కేంద్ర మంత్రి జయశంకర్‌ను కోరారు. ఇక AICC అధ్యక్షుడు సైతం పాకిస్తాన్ తో భారత్ చిన్నపాటి యుద్ధాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహల్గాంలో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లే ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారన్నారని వ్యాఖ్యానించారు మల్లిఖార్జున ఖర్గే . పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. వారి తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com