Terror Attacks : తెలుగు రాష్ట్రాల్లో భారీపేలుళ్లకు కుట్ర

పేలుళ్ల కుట్ర కేసులో దొరికిన ఇద్దరు నిందితులు సిరాజ్, సమీర్ ను దర్యాప్తు బృందాలు మూడవ రోజు విచారణ జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం లోతుగా సిరాజ్, సమీర్లను ప్రశ్నించింది. సిరాజ్ కు ఉగ్ర లింకులు ఉన్నట్లు ఎస్ఐఏ బృందం గుర్తించింది. యూపీ, మహా రాష్ట్ర కర్ణాటక లోని ఉగ్రవాద మోటివేషన్ క్లాసుల్లో సిరాజ్ పాల్గొన్నాడని దర్యాప్తు బృందం గుర్తించింది. సుమారు ఎనభై గంటలు మోటివేషన్ క్లాసుల్లో సిరాజ్ ఉన్నాడు. ఉగ్రవాద అవగాహన తరగతుల్లో ఆహారం, నిద్ర లేకుండానే 80 గంటల పాటు జరిగిన కఠోర శిక్షణ తరగతుల్లో సిరాజ్ పాల్గొన్నట్టు ఎస్ఐఏ నిర్ధారణకు వచ్చింది.
భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే ఈ క్లాసుల్లో ప్రధాన బోధనగా అధికారులు గుర్తించారు. ఈ క్లాసులకు హాజరయ్యే నిమిత్తం తరచూ యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు సిరాజ్ వెళ్లాడు. సిరాజ్ ట్యాబ్లోని కీలక సమాచారంపై ఎస్ఐఏ ఆరా తీస్తోంది. భారతదేశంలో మారణహోమానికి పెద్ద ప్లాన్లే ఉన్నట్టు ఎస్ఐఏ గుర్తించింది. 20 మంది యువకులకు ఐదు ప్రాంతాల్లో మానవ బాంబులుగా ప్రయోగించాలని ప్లాన్ సిద్ధం చేశారని ఎస్ఐఏ బృందం పసిగట్టింది. విజయ నగరంలో దొరికి నసిరాజ్, హైదరాబాదీ సమీర్ స్కెచ్ లపై కూపీలాగుతున్నారు పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com