Actress Kasturi : 14 రోజుల రిమాండ్‌లో కస్తూరి

Actress Kasturi : 14 రోజుల రిమాండ్‌లో కస్తూరి
X

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళ నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తూ ఎగ్మోర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కస్తూరి ఈనెల 29 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుజల్ సెంట్రల్‌ జైలుకు తరలించారు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమెను హైదరాబాద్‌లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 3న చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమాజ సమ్మేళనంలో కస్తూరి తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌ ఆమెను జైలుకు పంపేలా చేశాయి.

Tags

Next Story