Kangana Ranaut : నటి కంగనాపై దానం వివాదస్పద వ్యాఖ్యలు

Kangana Ranaut : నటి కంగనాపై దానం వివాదస్పద వ్యాఖ్యలు
X

బీజేపీ హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ, బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ బుధవారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించినంది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్ కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని దేశ ప్రజలు సహించరన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత విమర్శలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ పై, ఇతర బీజేపీ నేతలపై సుప్రీం కోర్టు, ఢిల్లీ కోర్టు, డీజీపీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story