Manmohan Singh Biopic : వివాదంలోకి మన్మోహన్ బయోపిక్

Manmohan Singh Biopic : వివాదంలోకి మన్మోహన్ బయోపిక్
X

మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇవాళ మరోమారు చర్చకు వచ్చింది. మన్మోహన్ సింగ్ పాత్రలో దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. సింగ్ సిగ్నేచర్ మార్క్ హావభావాలు, రూపం, మాట్లాడే విధానంతో అనుపమ్ పాత్రకు జీవం పోశారు. ఈ సినిమా వివాదం మరో మారు తెరపైకి వచ్చింది. అనుపమ్ ఖేర్ ను నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మన్మోహన్ జీవితం ఆధారంగా బాలీవుడ్ బయోపిక్ 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ఐదేళ్ల క్రితం విడుదలైంది. ఆయనను 'రిమోట్ కంట్రోల్డ్' ప్రధానమంత్రిగా చిత్రీకరించడం సహా ప్రతిదీ వివాదంగా మారింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించిన కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు సీరియస్ అయ్యారు. పార్టీ అభ్యంతరాలు లేవ నెత్తింది. ఈ వివాదాలే సినిమా విజయానికి కలి సొచ్చాయి. మూవీలో ఏం ఉందో చూడా లన్న ఉత్సుకతతో జనం థియేటర్లకు వచ్చారు. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మన్మోహన్ పాత్ర చేసేందుకు తాను మొదట ఒప్పుకోలేదని, రిజెక్ట్ చేశానని అనుపమ్ ఖేర్ చెప్పారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఆ పాత్రలో యాక్ట్ చేయాల్సి వచ్చిందని అన్నారు అనుపమ్ ఖేర్.

Tags

Next Story