జాతీయ

Corona Death In India: కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి..

Corona Death In India: ప్రపంచాన్నే గడగడలాండించిన కరోనా.. మన దేశంలోనూ విలయతాండవం చేసింది.

Corona Death In India: కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి..
X

Corona Death In India: ప్రపంచాన్నే గడగడలాండించిన కరోనా.. మన దేశంలోనూ విలయతాండవం చేసింది. దేశవ్యాప్తంగా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో కొవిడ్ వేరియంట్లు మరణమృందంగం మోగించాయి. కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలను నమోదు చేసిన దేశం మనదే.

ప్రపంచంలో అమెరికాలో అత్యధికంగా 9.2 లక్షల మంది వైరస్‌తో మృతి చెందగా.. తర్వాత బ్రెజిల్‌లో 6.3 లక్షల మంది మరణించారు. మనదేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా లక్ష 49వేల 394 కొవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో 15-18 ఏళ్ల మధ్యనున్నవారిలో 65 శాతం తొలి టీకా డోసు తీసుకున్నారు. రెండో డోసును అర్హులైన 34.90 లక్షల యువత అందుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. టీకాల విషయంలో యువ ఇండియా రికార్డులు సృష్టిస్తోందన్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES